కరోనా కట్టడికి సహకరించండి: సజ్జనార్

41
sajjanar

కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలన్నారు సీపీ సజ్జనార్. శుక్ర‌వారం ఉద‌యం ఎర్ర‌గ‌డ్డ చెక్‌పోస్టును త‌నిఖీ చేశారు సజ్జనార్.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… లాక్‌డౌన్ ఆంక్ష‌లు, ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించారు. లాక్‌డౌన్ ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు.

ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత రోడ్ల‌పైకి ఎవ‌రూ రావొద్ద‌ని, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రోడ్ల‌పై వ‌చ్చిన వాహ‌న‌దారుల‌ను ఆపి.. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పై తిరిగే వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.