నడ్డా..తెలంగాణ మనసు గెలుచుకో..

30
- Advertisement -

తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే ముందు గుజరాత్‌కు ఇచ్చిన ప్యాకేజీలు తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇది పోరాటల గడ్డ ఇక్కడి ప్రజలకు పోరాటాలు కొత్త కావని హరీశ్‌రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను హెచ్చరించారు. ఎన్నికల ముందు గుజరాత్‌కు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఇవ్వండి. లేదంటే హక్కుగా మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి చాలు అని అన్నారు.

15వ ఆర్థిక సంఘం తెలంగాణ‌కు రూ. 5, 374 కోట్ల ఇవ్వాల‌ని సిఫార‌సు చేసింది. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి న‌డ్డా. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌కురూ. 24 వేల కోట్లు ఇవ్వ‌మ‌ని నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశ చ‌రిత్ర‌లో ఆర్థిక సంఘం చెప్పింది చెప్పిన‌ట్లు అమ‌లైంది. మ‌రి ఒక్క తెలంగాణలో ఎందుకు అమ‌లు కావ‌డం లేదో చెప్పాలి. ఆర్థిక సంఘం నివేదిక‌ను గ‌త ప్ర‌భుత్వాలు తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేశాయి. మ‌రి తెలంగాణ‌లో ఎందుకు అమ‌లు కావ‌డం లేదు. బీజేపీ నాయ‌కులు స‌మాధానం చెప్పాలి. తెలంగాణ ప‌ట్ల కుట్ర‌పూరిత‌, ప‌క్ష‌పాత వైఖ‌రి కాదా? తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర కాదా? డ‌బ్బులు ఇవ్వ‌కుండా, ప‌నులు జ‌ర‌గుత‌లేవు అని చెప్ప‌డం కుట్ర కాదా? అని హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

రూ. 15 వేల కోట్ల ఎఫ్ఆర్‌బీఎంలు ఆపి, బోరుబావుల కాడ మీట‌ర్లు పెట్ట‌లేద‌ని రూ. 12 వేల కోట్లు, రాష్ట్రానికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా ఆపి, ఇంకోవైపు రాష్ట్రంలోకి వ‌చ్చి అది అమ‌లైత‌లేదు.. ఇది అమ‌లైత‌లేదు అని చెప్పి జీతాలు లేటు వ‌స్తున్నాయ‌ని మాట్లాడటం మీ కుట్ర కాదా? దీనికి స‌మాధానం ఏంటి? బీజేపీ నాయ‌కులు స‌భ‌ పెట్టుకుంటే అభ్యంత‌రం లేదు. ఈ రాష్ట్రానికి మీరు చేసిన‌ మేలు ఏంటో చెప్పాల‌ని హ‌రీశ్‌రావు న‌డ్డాను డిమాండ్ చేశారు.

రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు తెలంగాణ జీఎస్‌డీపీ రూ. 4 ల‌క్ష‌ల 51 వేల కోట్లు. ఈ ఎనిమిదేండ్ల‌లో రూ. ప‌దంకొండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌కు జీఎస్‌డీపీ చేరింది. ఇది మ‌న ప‌నితీరుకు గీటురాయి. రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్పుడు తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం రూ. 1,12,162 . గ‌త సంవ‌త్స‌రం త‌ల‌స‌రి ఆదాయం రూ. 2,75,443గా నమోదైంది. అంటే తెలంగాణ వచ్చాక తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.

బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఈ దేశంలో రూ. 56 వేల కోట్లు అప్పు ఉండే. ఇవాళ రూ. 1,35, 87, 893 కోట్లకు అప్పు చేరింది. 8 ఏండ్ల పాల‌న‌లో ఒక కోటి కోట్ల అప్పు చేసిండ్రు. ఏడాదికి దాదాపు రూ. 12 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేస్తున్నారు. నెల‌కు ల‌క్ష కోట్ల అప్పు చేస్తున్న‌ది బీజేపీ ప్ర‌భుత్వం. మీరు అప్పుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్ప‌దంగా ఉంది అని హ‌రీశ్‌రావు అన్నారు.

2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు.. ఈ దేశ త‌ల‌స‌రి ఆదాయం 79,118 రూపాయాలు ఉంటే మొన్న రూ. 1,50,700. అంటే దేశం కంటే మ‌న పౌరుల త‌ల‌స‌రి ఆదాయం ఒక ల‌క్ష 25 వేల 436 రూపాయాలు అధికంగా ఉన్న‌ది. ఇది మేం చెప్పే లెక్క‌లు కాదు.. కేంద్రం చెప్పిన లెక్క‌లు ఇవి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో త‌ల‌స‌రి ఆదాయం ఎందుకు పెర‌గ‌లేద‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

ఇవి కూడా చదవండి…

కోమటిరెడ్డి విత్ మోడీ..దేనికి చర్చ?

వైఎస్ జగన్ ‘ వార్నింగ్ ‘ లు..!

‘బండి’న్న.. ముసలి కన్నీరెందుకన్నా!

- Advertisement -