అమితాబ్ కామెంట్స్ పై రచ్చ

72
- Advertisement -

బాలీవుడ్ బిగ్ బీ అమితా‌బ్ బచ్చన్ ఇటీవల కోల్‌కతాలో వాక్ స్వేచ్ఛపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా అమితాబ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ‘పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి’ అని అమితాబ్ అన్నారు. ఈ కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో అమితాబ్ కామెంట్స్ నిరంకుశలను (మమతా బెనర్జీని ) ఉద్దేశిస్తూ చేసినవిగా ఉన్నాయని బీజేపీ నేత అమిత్‌ మాల్వియా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై తృణమూల్‌ ఎంపీ నుశ్రత్‌ జహాన్‌ స్పందిస్తూ… ‘‘సినిమాలపై నిషేధం విధించడం, నిజం మాట్లాడినందుకు సామాన్యులను శిక్షించడం. ఇవే నిరంకుశ పాలన సంకేతాలు’’ అని ట్వీట్ చేసింది. ఇన్ డైరెక్ట్ గా ఆమె బీజేపీ పై విమర్శలు చేసింది. పైగా ఇదంతా బీజేపీ హయాంలోనే జరుగుతోందని అని ఆమె కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి అమితాబ్ బచ్చన్ భావ ప్రకటనా స్వేచ్ఛపై చేసిన వ్యాఖ్యలు ఇలా రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దానికి తెర తీసింది.

ఒకపక్క తన కామెంట్స్ ఇలా వివాదాస్పదమవుతుంటే.. మరోపక్క అమితాబ్ మాత్రం.. ఓ యంగ్ హీరో పై క్రేజీ కామెంట్స్ చేశారు. కేబీసీలో ఓ కంటెస్టెంట్ అమితాబ్‌ను హీరో టైగ‌ర్ ష్రాఫ్ గురించి అడిగారు. దీనికి స‌మాధానంగా బిగ్ బీ.. ‘వాడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. మా ముందే వాడు పుట్టాడు. చిన్నప్పటి నుంచి కుస్తీలు ప‌ట్టేవాడు. అంద‌రినీ కొట్టేవాడు. ఇప్పుడు పెద్దవాడ‌య్యాక సినిమాల్లో కౌగిలింత‌లు మొద‌లు పెట్టాడు. టైగ‌ర్ ష్రాఫ్ చాలా అందగాడు అని అమితాబ్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి…

మహేష్ తో తివిక్రమ్ జోనర్ అదే

పుష్ప2 డైలాగ్ లీక్ తో కొత్త సమస్య!

తల్లితండ్రులు కాబోతున్న అట్లీ–ప్రియా

- Advertisement -