ఖమ్మం నుంచే శంఖారావం…హరీశ్‌

64
- Advertisement -

బీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత జరగుతున్న తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 18న జరిగే ఖమ్మం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని అన్నారు. దేశంలోని ప్రముఖ జాతీయ నాయకులు ఖమ్మం సభలో పాల్గొంటారని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ…వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పార్కింగ్‌ కోసం 448 ఎకరాలు కేటాయించమని, 20 పార్కింగ్‌ స్థలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. సభలో వేయి మంది వాలంటీర్లు పాల్గొంటారని… ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా జనసమీకరణ జరుగుతుందన్నారు.

18వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని, డయాస్‌ ముందు భాగంలో ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ కేటాయించామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మాత్రమే సీఎం కేసీఆర్‌తో సభా వేదికపై ఉంటారని మిగతా మంత్రులు, నాయకులు సభావేదికపై ముందు కూర్చుంటారని అన్నారు.

ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల ప్రోటోకాల్‌ను మంత్రి మహమూద్‌ అలీ చూస్తారని, కేరళ సీఎంను రిసీవ్‌ చేసుకునే బాధ్యత ప్రశాంత్‌రెడ్డి, డి రాజా బాధ్యతలు పార్టీ నాయకుడు దాసోజు శ్రావణ్‌ రిసీవ్ చేసుకుంటారని అన్నారు. మంత్రి తలసానికి అఖిలేశ్‌ యాదవ్‌ రిసీవింగ్‌, సెండాఫ్‌ బాధ్యతలు అప్పగించామని మంత్రి హరీశ్‌ అన్నారు.

17వ తేదీ రాత్రికి నాయకులంతా హైదరాబాద్‌కు చేరుకుంటారని, 18న సీఎంతో బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం దేశ రాజకీయాలపై చర్చించనున్నట్టు తెలిపారు. సీఎంతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని…అనంతరం రెండు హెలీకాప్టర్లలో ఖమ్మం సభకు బయలుదేరుతారన్నారు. సభలో పాల్గొనే ముందు సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్‌లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

ఇవి కూడా చదవండి…

మోదీపై ప్రశంసల జల్లు..ఎక్కడంటే?

సంక్రాంతి కానుకగా వందే భారత్‌…

తెలంగాణ అభివృద్ధికి కలిసిరండి..

- Advertisement -