17లోక్ సభ స్ధానాలకు 795నామినేషన్లుః రజత్ కుమార్

203
Rajat Kumar
- Advertisement -

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు మొదటి దశ నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్ధానాలకు గాను 795 నామినేషన్లు వచ్చినట్టు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగియడంతో ఆయన సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 245 నామినేషన్లు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు పాత ఇవిఎం యంత్రాలు ఇచ్చారని, వీటి ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ఓటిం గ్ నిర్వహించలేమన్నారు. కొత్త ఇవిఎంలు కావాలని ఇసిఐఎల్‌కు లేఖ రాసామని, అవి వస్తే నిజామాబాద్‌లో ఇవి ఎంల ద్వారా ఓటింగ్ నిర్వహించ వచ్చే మో పరిశీలిస్తామన్నారు.

ఒక వేళ దాఖలైన నామినేషన్ల ప్రకారమే అభ్యర్థులు బరిలో ఉంటే నిజామాబాద్ పార్లమెంట్‌కు బ్యాలెట్ పద్దతినే ఓటింగ్ జరుగుతుందన్నారు. జిల్లాల వారీగా పంపిణీ కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలంగాణను పాకిస్ధాన్ అన్న వ్యాఖ్యలను పరిశీలిస్తామన్నారు. త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 26న ముగుస్తుందని.. 28న ఉపసంహరణ ఉంటుందన్నారు. ఫారం 26లో పూర్తి కాలంలు నింపాలని, ఏ ఒక్కటి ఖాళీగా వదిలినా నామినేషన్‌ను తిరస్కరిస్తామన్నారు. ఆ తరువాత అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వారు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఫారం7 సమర్పించాలని తెలిపారు.

- Advertisement -