- Advertisement -
రాష్ట్రంలో మే నెలలో రికార్డు స్ధాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. మే 6 నుండి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు రూ.1864.95 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో బీర్ల వాటా రూ.800 కోట్లు కాగా.. లిక్కర్ వాటా రూ. 1000 కోట్లకుపైగా ఉంది.
మే 6న రూ.72 కోట్ల మద్యం డిపోల నుండి బయటకు పోయింది. మే 16న రూ.100 కోట్లు, మే 26న అత్యధికంగా రూ.140 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్స్ షాపులకు వెళ్లింది. కాగా మే 31న రూ. 62 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
సాధారణంగా వేసవిలో బీర్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఈసారి కరోనా భయాందోళనల కారణంగా మందుబాబులు బీరు జోలికి ఎక్కువగా వెళ్లలేదు.
- Advertisement -