రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

126
ts
- Advertisement -

మందుబాబులకు కిక్‌ ఇచ్చే షాకిచ్చింది ప్రభుత్వం. నేటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలను ఇవాళ ప్రకటించనుండగా ప్రాథమిక అంచనా ప్రకారం.. పది శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.

క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే బీర్ల ధరలను కూడా ప్రభుత్వం పెంచనుంది. బీర్లపై సగటున రూ.20 వరకు పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇవాళ ఉదయం నిల్వలను లెక్కించి, కొత్త ధరల ప్రకారం ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను వసూలు చేయనున్నారు.

- Advertisement -