సింగర్‌ బర్త్‌ డేకి పాట పాడిన బాలయ్య..!

547
Balakrishna
- Advertisement -

నేడు సింగర్‌ సింహా పుట్టినరోజు సందర్భంగా ఆయనతో హీరో బాలకృష్ణ కేక్ కట్ చేయించారు. అంతేకాదు.. ‘హ్యాపీ బర్త్ డే టు యూ’ అంటూ బాలయ్య పాటపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేయాస్‌ గ్రూప్‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం సింగర్‌ సింహా పాటలు పాడుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ పాట పాడారని తెలిసింది. ఈ పాటను ఈ నెల 10వ తేదీన రిలీజ్‌ కాబోతోందట.

- Advertisement -