తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

320
kavitha
- Advertisement -

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు, యువతులు వివిధ రకాల ముగ్గుల వేశారు. రంగు రంగుల ముగ్గులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కళకళలాడింది.ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసిన తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు.

ముందుగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులు ఉన్నాయని అన్నారు. అంతేకాదు సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడేందుకు తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కృషి చేస్తున్న ఎమ్మెల్సీ కవిత గారిని నేతలు అభినందించారు‌. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన మొదటి ‌ముగ్గురికి బహుమతులు అందజేసారు. అంతేకాక ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి మంచాల, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రభావతి, జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -