తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..

31
mlc kavitha

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి హైదరాబాద్‌ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుండి ముగ్గుల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షులు వరలక్ష్మి మంచాల తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో జిల్లాలోని మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన మొదటి ముగ్గురికి ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని తెలిపారు, పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని అని, పోటీలో పాల్గొనే వారు తమ తమ ముగ్గు మరియు ఇతర రంగోలి సామాగ్రిని తమ వెంట తీసుకురావాలని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు‌ వరలక్ష్మి మంచాల, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ కోరారు.

ఈ పోటీలో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన నంబర్స్..

సెల్ నెంబర్:
9505942801 శైలజా రావు
9849390560 కవిత కడుదుల
9346351287 సుచిత్ర
9966278079 లతా రావు

  1. బబిత