పసుపుబోర్డుపై ఎంపీ అరవింద్ అసత్యప్రచారం…

267
banda prakash
- Advertisement -

పసుపుబోర్డుపై ఎంపీ అరవింద్ అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు ఎంపీ బండ ప్రకాష్‌. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గత రెండు, మూడు రోజులుగా నిజామాబాద్ లోపసుపు బోర్డ్ తెచ్చిన అని ఎంపీ అరవింద్ చెబుతున్నారని ఇందులో నిజం లేదన్నారు. తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన టిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.

గతంలో స్పైసేస్ బోర్డ్ కోసం గుంటూరు కు వెళ్లే వాళ్ళం..కానీ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ గారి కృషి తో వరంగల్ లో స్పైసిస్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేశారని చెప్పారు. పసుపు బోర్డ్ కోసం మాజీ ఎంపీ కవిత ఎంతో కృషి చేశారని….ఎన్నోసార్లు సభలో పసుపు బోర్డ్ కావాలంటూ పోరాటం చేశారని వెల్లడించారు.

పసుపు బోర్డ్ అంశం తెరపైకి వచ్చినప్పుడు వరంగల్ నుండి స్పైస్ బోర్డ్ కార్యాలయాన్ని తరలించమని పీయూష్ గోయెల్ చెప్పారు..ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్న డివిజన్ ఆఫీసు ను రీజనల్ ఆఫీస్ గా అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించారన్నారు. రెండేళ్లపాటు రిపోర్ట్ చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని అని ఉంది..పసుపు రైతుల కోసం కేంద్రం నుండి ప్రతి ఏటా 100 కేటాయించాలని రైతులు ఉద్యమం చేశారని చెప్పారు.

15 రోజుల్లో పసుపు బోర్డ్ తేకపోతే రాజీనామా చేస్తా అని ప్రకటించిన అరవింద్…చేతనైతే కనీస మద్దతు ధర కోసం కేంద్రంతో మాట్లాడాలన్నారు. కేంద్రం 17 పంటలకు మద్దతు ధర ఇస్తోందని….కిసాన్ సమ్మాన్ పథకం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం కాపీ అన్నారు.

- Advertisement -