కరోనా రికవరీలో రెండోస్ధానంలో తెలంగాణ..

224
covid 19
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్దాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 54 వేలు దాటగా కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.86 శాతం కాగా, దేశ వ్యాప్తంగా ఆ రేటు 2.3 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 15,654 మంది నమూనాలను పరీక్షించగా, 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో కరోనా రికవరీలో దేశంలో తెలంగాణ రెండో స్ధానంలో ఉండగా మరణాల రేటులో పదో స్దానంలో ఉంది. ప్రధాని మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో కరోనా పరిస్ధితి మరింత దిగజారింది. 13 ఏళ్లు గుజరాత్‌ను పాలించిన మోడీ పాలించిన రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉండగా మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో దారుణమైన పరిస్ధితిలో ఉంది.

- Advertisement -