ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు..!

177
kim jong
- Advertisement -

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా ఇప్పటివరకు 213 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కేసు నమోదుకాలేదని ప్రకటించారు ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.

దక్షిణ కొరియా నుండి ఓ వ్యక్తి సరిహద్దుగుండా అక్రమ మార్గంలో ఉత్తర కొరియా రావడం,అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో సరిహద్దు నగరమైన కెసోంగ్‌లో ఎమర్జెన్సీతో పాటు లాక్ డౌన్ విధించారు.

అలాగే సరిహద్దు నుండి ఆ వ్యక్తి అక్రమంగా ప్రవేశించడంపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని క్వారంటైన్ కేంద్రానికి తరలించగా అతనితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఒక‌వేళ ఆ వ్యక్తికి కరోనా వచ్చినట్లు ప్రకటిస్తే ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైనట్లవుతుంది.

- Advertisement -