దేశంలో తెలంగాణ ఆర్ధిక శక్తిగా ఎదుగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్ లకు, జాతీయ రహదారులకు సభా వేదిక నుంచే శంకుస్ధాపన చేశారు.
అనంతరం మాట్లాడిన మోడీ.. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది… గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పనకు ఎంతో కేంద్రం కృషి చేసిందన్నారు. తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. తెలంగాణలో కనెక్టవిటి, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రూ. 6వేల కోట్లు ఖర్చు చేశాం అని తెలిపిన ప్రధాని… దేశం అభివృద్ధిలో తెలుగు వారి ప్రతిభ కీలకం అన్నారు.
Also Read:ప్రపంచ సదస్సుకు ఓయూ ప్రొ.కుమార్ మొలుగారం
దేశానికి ఇది స్వర్ణ సమయం అని… దేశాభివృద్ధికోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నాం అన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం…. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్ – ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని…- కరీంగనర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం అని చెప్పిన ప్రధాని… తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం అన్నారు.
Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి అని తెలుసా..!