బెండకాయ సర్వ రోగనివారిణి..!

98
- Advertisement -

కూరగాయలలో బెండకాయ గురించి తెలియని వాళ్ళు ఉండరు. బెండకాయతో సాంబారు, వేపుడు, కర్రీ.. వంటి ఎన్నో రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని ఇష్టంగా తింటూ ఉంటాము. అయితే బెండకాయకు ఉండే జిగట కారణంగా.. వాటితో చేసిన వంటకాలను తినడానికి ఇంట్రెస్ట్ చూపరు కొందరు. కానీ బెండలో ఉండే పోషకాల విలువల గురించి తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు. బెండలో ఉండే పోషకాల సమ్మేళనం కారణంగా అనేక వ్యాధులకు సర్వ రోగనివారిణిగా అభివర్ణిస్తారు ఆరోగ్య నిపుణులు. బెండలో విటమిన్ సి నుంచి విటమిన్ బి కాంప్లెక్స్ వరకు అన్నీ రకాల విటమిన్లు మరియు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ వంటి అన్నీ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. .

ప్రతిరోజూ మనం తినే ఆహారంలో బెండకాయను చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇక బెండలో లెక్టిన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని వివిధ క్యాన్సర్ కారకాలను ఎదుర్కోవడంలో సహాయ పడుతుంది. బెండలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణాశయ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పెక్టిన్ మూలకం గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఇతర కూరగాయలతో పోల్చితే బెండలో క్యాన్సర్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడంలో కూడా బెండ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక బెండ ప్రతిరోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గి.. గుండె సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తప్పకుండా బెండకాయతో చేసిన వంటలు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బెండ అన్నీ పోషకాల సమ్మేళనం కాబట్టి.. కడుపులోని శిశువుకు తగిన రీతిలో పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్న మాట.

Also Read:కీలకమ్యచ్‌లో కివీస్ గెలుపు..

- Advertisement -