Gadkari:మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

26
- Advertisement -

కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు కేంద్ర నితిన్ గడ్కరీ. వరంగల్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేయగా ఈ సందర్భంగా మాట్లాడిన గడ్కరీ.. గతిశక్తి యోజన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నారు. తెలంగాణలో రూ.1.10 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయని… 2024 కల్లా తెలంగాణలో 2లక్షల కోట్లు ఖర్చు చేస్తాం అన్నారు.

ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు కేంద్రం అండగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ రహదారులకు కృషి చేశామని, తొమ్మిదేళ్లలో రహదారుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేశామని అన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ కేటాయించామని తెలిపారు.

Also Read:Modi:ఆర్ధిక శక్తిగా తెలంగాణ

ఇక ప్రధాని వరంగల్ పర్యటన సందర్భంగా రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యాను ఫాక్చరింగ్ యూనిట్ కు , జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఎన్-163జీ కి శ్రీకారం చుట్టారు. రూ. 2,147 కోట్లతో జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ ఎన్‌హెచ్ పనులకు , రూ. 3,441 కోట్లతో మంచిర్యాల – వరంగల్ ఎన్‌హెచ్ పనులకు శంకుస్థాపన చేశారు.

Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి అని తెలుసా..!

- Advertisement -