సచివాలయం కూల్చివేత….. హైకోర్టులో పిల్

250
telangana highcourt
- Advertisement -

హైదరాబాద్ సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని హైకోర్టు లో పిల్ ధాఖలు చేశారు ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ భవనాల ను కూల్చివేస్తున్నారని ….భవనాల కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం అవుతుందని పేర్కొన్నారు.

సచివాలయం కూల్చివేత పనులతో 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలికి ఆటంకం కలుగుతుందని పేర్కొంది హైకోర్టు.మున్సిపాలిటీ సాలీడ్ వెస్ట్ మ్యానేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత పనులు చేపడుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొనగా ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాల ను కూల్చివేశమని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్.

భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వంకు హైకోర్టు అదేశాలిచ్చింది.సోమవారం వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొదని తెలిపింది. సచివాలయం కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వం కు హైకోర్టు అదేశించింది.

సోమవారం పూర్తి వివరాలు సమర్పిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలపగా అప్పటివరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.

- Advertisement -