మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

582
ts high court
- Advertisement -

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై దాఖలైన అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను హైకోర్టు కోట్టేసింది.

గత కొన్ని నెలలుగా మున్సిపల్ ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి ప్రక్రియ చేపట్టడం లేదని పేర్కొంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని విచారించిన న్యాయస్ధానం ఇవాళ తీర్పును వెలువరిస్తూ పిటిషనర్ల అభ్యంతరాలను కొట్టివేసింది.

- Advertisement -