నూతన కౌన్సిలర్లకు మంత్రి జగదీష్ రెడ్డి అభినందనలు..

24
Minister jagadish reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అభివృద్ది,సంక్షేమనికి ప్రజలు ఓటేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కలిశారు. వారికి మంత్రి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు ఉన్నారు.