నేటి నుంచే బర్రెల పంపిణీకి శ్రీకారం…

320
cattle scheme from today
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. పాడి పరిశ్రమకు పెద్దపీట వేసేలా బర్రెల పంపిణీ పథకానికి నేటి నుంచే అంకురార్పణ చేయనుంది. వరంగల్ జిల్లా ముల్కనూర్‌లో మంత్రులు కడియం,ఈటల,తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు ప్రారంభించనున్నారు.

రూ.1500 కోట్లతో బర్రెల పంపిణీ పథకం అమలు చేయనున్నారు. రూ.80వేల విలువైన ఒక్కో బర్రెను 50శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 82 వేల 823 మంది లబ్ది పొందనున్నారు. ఎస్సీ,ఎస్టీలకు 75 శాతం,ఇతరులకు 50 శాతం సబ్సిడీతో బర్రెల పంపిణీ చేయనున్నారు. రైతులు కోరుకున్న ప్రాంతంలో ఎంచుకున్న బర్రెలను కొనుగోలుచేసి ఇచ్చేలా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ఒక్కొక్క బర్రెకు రూ.5వేల చొప్పున రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం చెల్లించనుంది.

బర్రెల పంపిణీ చేయడమే కాదు 300 కిలోల దాణా.. మూడేండ్లపాటు బీమా పాలసీ చేయనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వందమంది పాడి రైతులకు సబ్సిడీపై బర్రెలు పంపిణీ చేస్తారు. విజయ డెయిరీలో సభ్యులుగా ఉన్న 63,304 మందికి, ముల్కనూరు మహిళా డెయిరీలోని 19,307, కరీంనగర్ డెయిరీలోని 57,206, మదర్ డెయిరీలోని 43,006 మంది సభ్యులకు పంపిణీ చేయనున్నారు.

- Advertisement -