టీచర్ల బదిలీల షెడ్యూల్‌ ఇదే…

71
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీలకు సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతులు బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ప్రారంభం కానున్నాయి. జనవరి 28వ తేదీ నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మార్చి 4నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ప్రక్రియ ముగియనున్నట్టు విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్ర‌క్రియ మొత్తం 37 రోజుల్లో ముగియ‌నుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వ‌ర‌కు అప్పీళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. టీచ‌ర్ల నుంచి ద‌ర‌ఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను ప‌రిష్క‌రించ‌నున్నారు.

జనవరి 15న ఉపాధ్యాయ సంఘాలు జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్‌రావు సబితా ఇంద్రారెడ్డి చర్చించిన సంగతి తెలిసందే. ఇందుకు అనుగుణంగా బదిలీలు పదోన్నతులు చేపడతామని హామీనిచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బదిలీలు పదోన్నతులు ప్రక్రియ మొదలైంది. అయితే గతంలో ప్రభుత్వం జీవో91 ప్రకారం పదోన్నతులు బదిలీలను సాధారణ పరిపాలన శాఖ నిషేధం విధించింది. దీంతో ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం రాత్రి జీఏడీ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి…

తెలంగాణ వంటకాలు చాలా ఘాటు…

సీజేఐ ఆలోచనను స్వాగతించిన స్టాలిన్‌…

21దీవులకు మోదీ నామకరణం..

- Advertisement -