ఆరోగ్య తెలంగాణకు మరో ముందడుగు:హరీశ్‌

217
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో శరవేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో 17 వైద్యకళాశాలలను ఏర్పాటు చేశారు. తాజాగా నిమ్స్‌ అభివృద్దికి ప్రభుత్వం రూ.1571కోట్ల నిధులను మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిమ్స్‌ విస్తరణ ప్రాజెక్ట్‌కు పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ…నిమ్స్ విస్త‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 1,571 కోట్ల నిధులు కేటాయించ‌డంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో ఈ నిర్ణ‌యం మ‌రో ముంద‌డుగు అని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఆరోగ్య రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

8వైద్య కాలేజీలను ప్రారంభించిన సీఎం

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం..

తెలంగాణకు నేడు విశిష్టమైన దినం:కేటీఆర్‌

- Advertisement -