ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చాలా బాగుంది..

209
suresh
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఉన్న చెడు అభిప్రాయం పోయింది. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇక్కడ లేదు. చాలా మంచి చికిత్స అందించారు. సొంత వారిలా చూసుకున్నారని టీమ్స్‌ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 66 సంవత్సరాల సురేష్ తన అనుభవాన్ని వివరించారు. టీమ్స్‌ ఆసుపత్రి గురించి సురేష్‌ మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం నాకు కరోనా పాజిటివ్‌ అని తెలింది. దీంతో నేను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించాను. వారు ఒక్క రోజుకు లక్ష రూపాయాల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. దాంతో నా స్నేహితుడిని సలహా అడిగాను అతను తెలంగాణ ప్రభుత్వం కరోనా చికిత్స కోసం గచ్చిబౌలీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన టీమ్స్‌ ఆసుపత్రికి వెళ్లమన్నాడు. కానీ నాకు ప్రభుత్వ ఆసుపత్రుల మీది నమ్మకం లేదు. అయినా మా ఇంట్లో వాళ్లు ఆ ఆసుపత్రిలో బెడ్‌ బుక్‌ చేశారు. కానీ నేను వెళ్లలేదు.

అయితే ఒక్క రోజు టీమ్స్‌ ఆసుపత్రి నుండి డాక్టర్‌ ఫోన్‌ చేశారు. మీ బెడ్ బుక్‌ చేశారు కానీ ఇంకా రాలేదు అని అడిగారు. అప్పుడు నాకు ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం లేదు నేను రాను అని చెప్పా. దానికి డాక్టర్‌ ముందు మీరు వచ్చి రెండు రోజులు చికిత్స చేయించుకోండి అప్పుడు మీకు మా సేవలు నచ్చకపోతే మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పారు. దాంతో నేను ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యను. అక్కడికి వెళ్లాక నా అభిప్రాయం తప్పు అని అర్థమైంది. ఆసుపత్రిలో చాలా బాగా చూసుకున్నారు. ట్రీట్మెంట్‌ చాలా బాగుంది కొద్దిరోజుల్లోనే నేను కరోనా నుండి కోలుకున్నారు. టీమ్స్‌లో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అసుపత్రి అంతా ఎంతో నీట్‌గా ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఉంది. కరోనా నుండి నన్ను రక్షించిన డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు అని సురేష్ పేర్కొన్నారు.

- Advertisement -