కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది- తలసాని

142
minister talasani

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ బాగుపడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లుపై అసెంబ్లీ వద్ద మంత్రి తలసాని మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ బిల్లును రైతాంగం అంతా వ్యతిరేకిస్తున్నా ఎందుకు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు ? అని తలసాని ప్రశ్నించారు. అకాలీ దళ్ మంత్రి రాజీనామా చేసినా పట్టించుకోలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా ఈ బిల్లు ఇష్టం లేదు. అందుకే బిల్లు సందర్భంగా ఆయన సభలో లేరని మంత్రి అన్నారు.

బిల్లు పెట్టినపుడు చర్చ జరపాలా ?వద్దా ? బలం లేకున్నా మూజు వాణీ ఓటుతో ఎలా ఆమోదించుకుంటారు ? మంత్రి తలసాని కేంద్రాన్ని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర ఇది. మంద బలంతో బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దేశం లో విప్లవం మొదలైంది…ఇక బీజేపీ ఆటలు సాగవు అన్నారు మంత్రి. మతం పేరుతో ,కాశ్మీర్ పేరుతో బీజేపీ రాజకీయాలు ఎల్లకాలం సాగవు. జీఎస్టీపై కూడా బీజేపీ రాష్ట్రాలను మోసం చేసింది. వ్యవసాయ బిల్లు సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదు. తెలంగాణ బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారు.. తెలంగాణకు కేంద్రం కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఏడు వేల కోట్ల సాయం చేసిందని బీజేపీ నేతలు చెప్పిన అబద్దాన్ని పార్లమెంటులో కేంద్రమే బయట పెట్టిందని మంత్రి ఎద్దేవ చేశారు.

.కోవిడ్ ను తెలంగాణ సమర్ధంగా ఎదుర్కొందని కేంద్రం తెలంగాణకు 290 కోట్ల రూపాయల సాయం చేసిందని పార్లమెంటులో చెప్పారు. బీజేపీ నేతలు అబద్దాలు మానితే మంచిది. రెవెన్యూ చట్టం అసెంబ్లీలో తెచ్చినప్పుడు రైతులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర వ్యవసాయ బిల్లుపై నిరసనలు తప్ప సంబరాలు ఏవీ ?.డబుల్ బెడ్ రూం ఇళ్లపై కాంగ్రెస్ నేతల విమర్శల పై డైలీ సీరియల్ లా మాట్లాడటం మాకు ఇష్టం లేదు. మేము దేని మీద పారిపోలేదు. హైదరాబాద్ లో స్థలాలు లేకే బయట ఇండ్లు కడుతున్నాం. కాంగ్రెస్ హయంలో కూడా హైదరాబాద్ బయట ఇండ్లు కట్టేందుకు జీవో లు ఇచ్చారు. మేము లక్ష ఇండ్లు కడతామన్నం ..కడుతున్నాం అని మంత్రి వివరించారు.

111 చోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లు కడుతున్నాం ..మీడియా ఎక్కడికైనా వెళ్లి చూసుకోవచ్చు.రైతులతో గోక్కున్నోడు ఎవ్వడూ బాగు పడలేదు. రెవెన్యూ చట్టం పై మాకు బలమున్నా అందరికీ మాట్లాడే అవకాశమిచ్చాము. పార్లమెంటులో బీజేపీకి బలం ఉంటే బిల్లుపై అందరినీ ఎందుకు మాట్లాడ నీయలేదు ?…రైతుల ఉద్యమానికి అవసరమైతే సీఎం కెసిఆర్ నేతృత్వం వహిస్తారు. వెనక్కి తగ్గేది లేదు.సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నవారికి సాయం విషయంలో వెనక్కి తగ్గలేదు. కరోనా నేపధ్యంలోనే కొంత ఆలస్యమవుతోంది. రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంది.ఒకరిద్దరికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలి. అసెంబ్లీ దగ్గర ఆత్మహత్య చేసుకున్న నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు.

గొర్రెల పంపిణీ త్వర లోనే ప్రారంభిస్తామని అసెంబ్లీ వేదిగ్గా చెప్పా .ఎవరో ధర్నా చేస్తే పంపిణీ చేయడం లేదు…ఒక్క కోటి జనాభా ఉన్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచేందుకు లక్ష ఇండ్ల గురించి మాట్లాడతామా ?…సీఎం కెసిఆర్ చెప్పింది చేస్తారు..డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని కెసిఆర్ అసెంబ్లీ లోనే చెప్పారు..మేము ఏ విషయంలోనైనా ప్రజలకు జవాబు దారీ ఉంటాం..ఇప్పటికైనా కేంద్రం వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించు కోవాలి అని మంత్రి తలసాని పేర్కొన్నారు.