స్టార్ హీరో చనిపోలేదు.. భార్య క్లారిటీ

33
- Advertisement -

కోలీవుడ్ దిగ్గజ నటుడు, స్టార్ హీరో విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించింది. గత 24 గంటలుగా అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని మైయత్ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. వారం క్రితం విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై లోని మైయత్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. అయితే, ఈ నేపథ్యంలో విజయకాంత్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఊపు అందుకున్నాయి. దీంతో ఈ వార్తలపై విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ క్లారిటీ ఇచ్చారు.

ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ.. ”కెప్టెన్ విజయ్ బావున్నారు. ఆయన చనిపోలేదు. రూమర్స్ ను నమ్మకండి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు” అని తెలిపారు. నటుడిగా, డీఎండీకే అధినేతగా విజయకాంత్ తమిళంలో గొప్ప క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎప్పటికైనా తమిళంలో సీఎం కావాలని, విజయ్ కాంత్ ఎన్నో కలలు కన్నారు. కానీ, ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశారు. దీనికితోడు, విజయ్ కాంత్ అదృష్టం కూడా కలిసి రాలేదు. దాంతో, రాజకీయంగా విజయ్ కాంత్ అనుకున్న స్థాయిలో ఎదగలేదు.ప్రస్తుతానికి అయితే, విజయ్ కాంత్ ఆరోగ్యం కాస్త విషమంగా ఉంది. ముఖ్యంగా గత 24 గంటల్లో ఆయన పరిస్థితి నిలకడగా లేదు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో 14 రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్స్ చెబుతున్నారు. అనంతరమే ఆయన ఆరోగ్యం పై పూర్తి క్లారిటీ వస్తోందని తెలుస్తోంది. కెప్టెన్ విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:Rohith:ప్లీజ్ కంబ్యాక్.. రోహిత్?

- Advertisement -