తెలంగాణలో మొదలైన ఓటింగ్..

44
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలిసారి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు,నడవలేని వారికి ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు. ఇందులో భాగంగా మంగళవారం ఇంటింటి ఓటింగ్‌లో భాగంగా ఓటేశారు సీనియర్ సిటిజన్.

ఇంటి నుండే ఓటు వేసేందుకు ముందుగా ఫారం డి-12 సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎన్నికల అధికారి వారికి ఓటు వేసేందుకు అనుమిస్తారు. రాష్ట్రంలో 28,057 మందికి ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించగా ఓటింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది.

పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశాక వాటిని పోలింగ్ సిబ్బంది సేకరించి తీసుకువెళతారు. ముందుగా సమాచారం అందించి ఓటు వేయించేందుకు పోలింగ్ సిబ్బంది ఇళ్లకు వస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read:దేశంలో జమిలి ఎలక్షన్స్ కన్ఫర్మ్?

- Advertisement -