రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి నేడు పలు పార్టీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ భరత్‌లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం తీసుకునే చర్యలు బాగున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సేఫ్ గా జరపాలి. నామినేషన్ ప్రక్రియ- ఎన్నికల ప్రక్రియ కరోనా నిబంధలు పాటించాలన్నారు. అభ్యర్థుల ఖర్చులు పెంచాలని మేము కోరాము. జిహెచ్ఎంసి పరిధిలో 5, బయట 2.5 లక్షలు ఎన్నికల ఖర్చు పెంచాలని విజ్ఞప్తి చేసాము. పోలింగ్ కేంద్రాలను విశాలంగా ఉండేటట్లు చూడాలని కోరాము. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ప్రోగ్రాంలు నిర్వహించాలని తెలిపాము. దివ్యంగులకు ,కోవిడ్ రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాలి,పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని వివరించామని టీఆరెస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎన్నికల కథనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫిర్యాదు చేశాము. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియా కట్టడి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా వల్ల ఓటర్లు ప్రలోభాలకు గురి అవుతున్నారు.సోషల్ మీడియాను కట్టడి చేయాలని కోరామని తెలిపారు.