నేను మెస్సయ్యను కాదు: సోనూ సూద్

218
sonu sood
- Advertisement -

కరోనా,లాక్ డౌన్ నేపథ్యంలో వేలాది మందికి తనవంతు సాయాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్న సినీ నటుడు సోనూ సూద్‌ ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని నేను మెస్సయ్యను కాదు (IAmNoMessiah )అంటూ సోనూ రాసిన పుస్త‌కం డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు సోనూసూద్. ఇది త‌న‌ జీవిత క‌థ అని…. వేలాదిమంది వ‌ల‌స కార్మికుల వ‌లె త‌న క‌థ కూడా అని పేర్కొన్నారు.

కొవిడ్‌-19 మహమ్మారి ,దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో పేదరికంతో బాధపడుతున్న వలసదారులు అండగా నిలిచారు సోనూ సూద్. జాతీయ‌, అంత‌ర్జాతీయ ర‌వాణాకు సైతం ఏర్పాట్లు చేశారు. ఘ‌ర్ బేజో కార్య‌క్ర‌మాన్ని మాన‌వ‌తా మిష‌న్‌లాగా చేప‌ట్టారు.దీంతో సోనూ సూద్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

- Advertisement -