మారేడుమిల్లి అడవుల్లో బన్నీ.. ఇక చూస్కోండి!

172
Pushpa
- Advertisement -

ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప.సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లా లారీడ్రైవర్‌గా పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ పక్కన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పునఃప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ చిత్రం షూటింగ్ గత కొన్నినెలలుగా నిలిచిపోయింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షూటింగ్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. సెట్స్‌పై బన్నీ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంచుకుంది. “యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసినాడు… ఇక చూస్కోండి!” అంటూ చిత్తూరు జిల్లా యాసలో ట్వీట్ చేసింది.

- Advertisement -