Election Code:ఈ నిబంధనలు పాటించాల్సిందే!

36
- Advertisement -

ఎట్టకేలకు తెలంగాణలో ఎన్నికల నగార మోదింది. నవంబర్ 30 న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 3వ తేదీ ఓట్ల లెక్కింపు అలాగే ఫలితాలు వెలువడతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి నిన్నటితో పులిస్టాప్ పడింది. ఇక ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి పెట్టేందుకు సిద్దమౌతున్నాయి. ఇక నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఎలాంటి అవకతవకలు జరగకుండా పారా దర్శికంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటినే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత పార్టీలు మరియు అభ్యర్థులు పాటించవలసిన కొన్ని నిబంధనల గురించి చాలమందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.

1. రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కుల మతాల ఆధారంగా ఓట్లు అడగరాదు. అందుకే ఆలయాలు, మసీదులు, చర్చ్ లు వంటి మతపరమైన ప్రదేశాలలో బహిరంగ సభలు గాని వాటి ద్వారా ఓట్లు అడగడం గాని చేయరాదు.
2. వివిధ వర్గాల మద్య విద్వేషాలు పెరిగేలా వ్యాఖ్యలు చేయడం లేదా అలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేయరాదు.
3. అభ్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి వీలు లేదు. కానీ ప్రత్యర్థి పార్టీ ప్రకటించిన పథకాలు విధానాలపై విమర్శించే అధికారం ఉంటుంది.

Also Read:మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగ్ రిలీఫ్..

4. ఓటర్లను బెదిరించడం, వారికి లంచాలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం, పోలింగ్ భూత్ లకు 100 మీటర్ల దగర్లో ప్రచారాలు నిర్వహించడం వంటివి చేయరాదు. ఇంకా ఓటర్ల కోసం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా నిషేధమే.
5. భవనలపై, గోడలపై, వాహనాలపై కరపత్రికలు అటించడం, పార్టీ జెండాలు ప్రదర్శించడం, బ్యానర్లు కట్టడం వంటి చర్యలకోసం సంబంధిత యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
6. ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు, అభ్యర్థులు మరో పార్టీ కార్యక్రమాలను అడ్డుకోరాదు.
7. బహిరంగ సభలు నిర్వహించే ముందు ఆ ప్రదేశానికి సబంధించి అధికాలు లేదా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
8. పోలింగ్ రోజున ఓటర్లకు ఇచ్చిన గుర్తింపు స్లీప్ తెల్లని కాగితం పై ముద్రించాల్సి ఉంటుంది. ఆ స్లీప్ లో ఏ రాజకీయ పార్టీ గుర్తు, లేదా అభ్యర్థి పేరు వంటివి ఉండకూడదు.
9. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి ఓటర్లకు మద్యం అందించకూడదు.
10. ప్రభుత్వ ఖజానా ఖర్చు చేస్తూ ఎన్నికల ప్రచారాలు నిర్వహించరాదు.
ఇలా కొన్ని నిబంధనలను ఎన్నికల సమయంలో తప్పక పాటించాల్సి ఉంటుంది.

Also Read:Carrot Juice:క్యారెట్ జ్యూస్ తో లాభాలు

- Advertisement -