జైల్లో చంద్రబాబు.. ప్లాన్ లో వైసీపీ?

42
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సి‌ఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీంతో ఎప్పటినుంచే ప్రజల మద్య ఉండేందుకు జగన్ సరికొత్త వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీ అధినేత జైల్లో ఉండడంతో ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రాబోయే మూడు నెలలకు సంబందించి పక్కా షెడ్యూల్ ఫిక్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి.

పార్టీకి సబంధించిన ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను చేపట్టనున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష, బస్సు యాత్రలు, ఏపీకి జగనే ఎందుకు రావాలి, ఆడుదాం ఆంధ్రా.. ఇలా కొన్ని కార్యక్రమాలను ప్లాన్ చేసింది వైసీపీ పార్టీ. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు నిత్యం జగన్ నామ జపం చేసేలా ప్రణాళికలు రచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలోని కుటుంబాలను సందర్శించి వ్యాధుల బారిన పడిన వారికి ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే బస్సు యాత్రల ద్వారా నేతలందరిని నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవడం, ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం, ఆడుదాంఆంద్రా ప్రోగ్రాం ద్వారా గ్రామ స్థాయి నుంచి క్రీడకారులను బయటకు తీసుకురావడం.. ఇలా వచ్చే ఏడాది జనవరి వరకు పార్టీకి సంబంధించి ప్రోగ్రాం ను ఫిక్స్ చేశారు అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల దృష్టి అంతా వైసీపీ పైనే ఉండాలా చూసుకొనున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి పార్టీ టీడీపీలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడప్పుడే కుదుట పడేలా కనిపించడం లేదు. అందుకే ఎప్పటినుంచే ఎన్నికల ప్రచారంపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read:మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగ్ రిలీఫ్..

- Advertisement -