ఎన్నికల తర్వాత పెను మార్పులు?

17
- Advertisement -

లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో పెను మార్పులు చోటు చేసుకొనున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మార్పులు ఏమిటంటే టి కాంగ్రెస్ బీజేపీతో జట్టు కట్టడం. గత కొన్నాళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ఉందనే వార్తలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ఈ రకమైన వార్తలు బయటకు రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల బి‌ఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదు. అప్పటి నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య దోస్తీ అంశం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సి‌ఎం రేవంత్ రెడ్డి మోడీ సర్కార్ పై సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు. .

తెలంగాణలో గుజరాత్ మోడల్ అమలు చేస్తామని సి‌ఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం బీజేపీ కాంగ్రెస్ మద్య దోస్తీని బయటపెడుతుందనేది కొందరి అభిప్రాయం. ఇకపోతే తాజాగా బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకొనున్నాయని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఆ మార్పులేంటి ? ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ స్పందిస్తూ ఎన్నికల తరువాత గెలిచిన ఎంపీలతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడాని, రాష్ట్రంలో జరగబోయే ముఖ్యమైన మార్పు ఇదేనని కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు.

అయితే కే‌టి‌ఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా లేకపోలేదు. తనపై కుట్ర జరుగుతోందని ఆ మధ్య రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తనను సి‌ఎం పదవి నుంచి తప్పించేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నట్లు పరోక్షంగా ఆయన అన్నట్లు కొంతమంది అభిప్రాయం. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి సి‌ఎం పదవికి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరిన ఆశ్చర్యం లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఏది ఏమైనప్పటికి లోక్ సభ ఎన్నికల తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:రుణమాఫీ ఇప్పట్లో లేనట్లే..?

- Advertisement -