- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 57 వేలు దాటాయి. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,57,374కు చేరాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 15,425 యాక్టివ్ కేసులుండగా 12,888 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. 2,40,545 మంది కరోనా నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో 1,404 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 167 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -