రాష్ట్రంలో 24 గంటల్లో 2478 కరోనా కేసులు…

127
coronavirus

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత గంటల్లో 2478 కరోనా కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరాయి.

1,02,024 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 866 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో 25,730 మంది హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో 267 నమోద‌వ‌గా, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 190, రంగారెడ్డి జిల్లాలో 171,న‌ల్ల‌గొండ‌లో 135 కేసులు రికార్డ‌య్యాయి.

క‌రీంన‌గ‌ర్‌లో 129, ఖ‌మ్మంలో 128, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 95, సూర్యాపేట‌లో 87, కొత్త‌గూడెం జిల్లాలో 86, కామారెడ్డిలో 85, నిజామాబాద్‌లో 85, సిద్దిపేట‌లో 82, జ‌గిత్యాల‌లో 79, మంచిర్యాల‌లో 69, పెద్ద‌ప‌ల్లిలో 68, సంగారెడ్డిలో 67,యాదాద్రి భువ‌న‌గిరిలో 57, జ‌న‌గాంలో 51, మ‌హ‌బూబాబాద్‌లో 50, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 48 నమోదయ్యాయి.