Revanth:అధికారం చేతిలో.. బలం ఢిల్లీలో!

44
- Advertisement -

గతంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న తెలంగాణ వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం రాష్ట్రంలోనిదే అయినప్పటికి అధికారం మాత్రం ఢిల్లీలో ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇకపై పాలన మొత్తం డిల్లీ చుట్టూ తిరగబోతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రాష్ట్రంలో పాలన ఎలా జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడంతో అన్నీ నిర్ణయాలు ఆయనే తీసుకుంటారా ? లేదా పదవి చేతిలో ఉన్న అనుమతి కోసం వేచి చూస్తారా ? అనేది ప్రశ్నార్థకమే. ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించిన కాంగ్రెస్ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. .

అయితే వాటి అమలుకై ప్రమాణస్వీకారం రోజునే సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి ఆ మద్య చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ తో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారేమో అని భావించారంతా. కానీ అలాంటిదేమీ లేదని నిన్న వేణుగోపాల్ మీడియా సమావేశంలో తేటతెల్లమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సి‌ఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికి వన్ మ్యాన్ షో ఉండదని, క్యాబినెట్ తో పాటు పార్టీ హైకమాండ్ నిర్ణయాల మేరకే ప్రభుత్వం సాగుతుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు కే‌సి వేణుగోపాల్. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి నామమాత్రపు ముఖ్యమంత్రేనా ? అనే సందేహాలు రాక మానవు. మరి ముందు రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన రాష్ట్రంలో ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:Salaar:ప్చ్.. సలార్ ను భరించగలరా?

- Advertisement -