ఆలీబాబా అరడజన్ దొంగలు అనే సినిమా చూసే ఉంటాము. అందులో ఆరుగురు దొంగలకు ఒక ప్రధాన దొంగ నాయకత్వం వహిస్తూ సర్వం దోచుకుంటూ ఉంటారు. అదే మాదిరి తెలంగాణలో ఎన్నికల వేళ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అరడజన్ దొంగలతో సిద్దమైనట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల వేళ సిఎం అభ్యర్థి విషయంలో అర్హత కలిగిన ఒక్కరినీ మాత్రమే ఎన్నుకొని ఆ ఒక్కరికే పూర్తి మద్దతు ఇవ్వడం చూస్తుంటాము. కానీ టీ. కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నం సిఎం అభ్యర్థిగా ఉండేందుకు ఏకంగా ఆరుగురు పోటీ పడుతున్నారు. ఆ ఆరుగురు కూడా నువ్వా నేనా అన్నట్లుగా వారిలో వారే పోటీ పడుతూ అధికార దాహం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇలా ఈ ఆరుగురు సిఎం అధ్యర్తిగా ఉండేందుకు తెగ అరటపడుతున్నారు.
ఈ ఆరుగురిలో ఎవరిని సిఎం అభ్యర్థిగా నియమించాలో తెలియక హస్తం హైకమాండ్ కూడా తలలు పట్టుకుంటుంది. వీరిలో ఏ ఒక్కరినీ సిఎం అభ్యర్థిగా ప్రకటించినా ఇతర నేతల నుంచి తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే సిఎం అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అధిష్టానం. ఒకవేళ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఏడాదికో సిఎం ను మార్చిన ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలే కాంగ్రెస్ పార్టీకి దోపిడీ పార్టీగా ముద్ర పడింది. ఇప్పుడు సిఎం పదవి విషయంలో ఈ స్థాయిలో పార్టీ నేతలు పోటీ పడడం చూస్తుంటే.. రాష్ట్రాన్ని దోచుకునేందుకేనా ఈ పోటీ అనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రాభివృద్ది కోసం ఆలోచించడం మాని కేవలం సిఎం పదవే టార్గెట్ గా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఇట్టే అర్థమౌతుంది. అలాంటి వారికి అధికారమిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని చెబుతున్నారు రాజకీయ వాదులు.
Also Read:బండి సంజయ్ తిరుగుబాటు.. బీజేపీలో భయం!