19న కాళేశ్వరం పర్యటనకు సీఎం కేసీఆర్..

201
Cm Kcr Kaleshwaram

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వర పర్యటనకు సిద్దమయ్యారు. ఈనెల 18న రామగుండం, 19న కాళేశ్వరంలో పర్యటించునున్నారు. 18న రామగుండంలో ఉన్న 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌ను సందర్శిస్తారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19న ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల్ని సీఎం పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తీ చేశారు అధికారులు.