చింతమడకలో ఏకగ్రీవం..  హరీష్‌ రావు ఏం చేశాడో తెలుసా?

165
Harish-Rao KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఉరు చింతమడకలో ఎంపీటీసీ ఎన్నికలు ఎకగ్రీవం అయ్యాయి. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధి రాందేవి జ్యోతిని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలు. సిద్దిపేట జిల్లా చింతకమడక గ్రామంలో ఎంపీటీసీ స్ధానం ఈసారి అన్ రిజర్వుడ్‌ మహిళకు కేటాయించారు. ఈ ఎన్నిక కు టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సీఎం సొంత ఉర్లో ఎన్నికలు జరగడం ఎంటీ అని ఆలోచించిన గ్రామస్తులు…ఎంపీటీసీ స్ధానాన్ని ఏకగ్రీవం చేసుకుని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని భావించారు.

దీంతో కాంగ్రెస్, మిగతా పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఉపసంహరించుకున్నారు. దీంతో చింతమడకలో ఎన్నికలు లేకుండా టీఆర్ఎస్ అభ్యర్ధి రాందేవి జ్యోతిని ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే చింతమడకలో ఎంపీటీసీ స్ధానం ఏకగ్రీవం కావడానికి ముఖ్య కారణం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అని చెబుతున్నారు. ఎంపీటీసి ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు చింతమడక గ్రామస్తులతో చర్చించినట్లు తెలుస్తుంది. దీంతో సీఎం కేసీఆర్ పై హరీష్ మరోసారి తన ప్రేమను చాటుకున్నారని స్పష్టం అవుతుంది.