- Advertisement -
సిక్కింలోని జైమా వద్ద ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ వాహనంలో ఆర్మీ అధికారులు జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో 16మంది జవాన్లు అక్కడిక్కడే మృతి చేందారు. కాగా మిగిలిన క్షతగాత్రులను స్థానిక ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్లు కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీజవాన్లు అధికారుల కుటుంబాలకు సీఎం సానుభూతిని తెలిపారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని క్షతగాత్రులకు తగిన వైద్య సేవలందించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి…
కైకాల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి
రైతు క్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం…కేటీఆర్
బూస్టర్ డోసులను పంపించండి:హరీశ్
- Advertisement -