సూపర్ ఛాన్స్..కానీ కుదరదు అనేసింది

109
- Advertisement -

పెళ్లి, పిల్లలు తరువాత కూడా లేడీ సూపర్ స్టార్ నయనతార తన కెరీర్ ను బాగానే ముందుకు తీసుకెళ్తుంది. పైగా అటు నిర్మాతగా కూడా అదే ఊపును కొనసాగించడానికి నయన్ గట్టిగానే కష్టపడుతోంది. ఇప్పటికే నయనతార చేతిలో ఓ హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమా ఉంది. పైగా నిన్న రిలీజ్ అయిన కనెక్ట్ సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర కనెక్ట్ తో నయనతార కలెక్షన్స్ ను కూడా బాగానే రాబట్టింది.

ఇలాంటి టైమ్ లో ఓ మంచి అవకాశం నయనతార తలుపు తట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా మరోసారి నటించే అవకాశం. ఈ విషయం గత కొంత కాలంగా వార్తల్లో నలుగుతోంది. కానీ నయనతార మాత్రం రజిని తో ఇంకా సినిమా అంగీకరించలేదు. కారణం..ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నయనతార ఈ పాత్ర వద్దు అనుకుంటే.. త్రిష కి వెళ్లే ఛాన్స్ ఉంది. త్రిష ప్రస్తుతం యాక్టివ్ గా ఉంది. కాబట్టి ఆమె సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టొచ్చు.

ఇంతకీ నయనతార ఎందుకు రజినీకాంత్ తో ఛాన్స్ ను మిస్ చేసుకుంటుంది? అని ఆమె తమిళ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. కానీ నయనతార ఇప్పటికే దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయినా.. నయనతార పార్ట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. కాబట్టి షారుఖ్ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలి. ఆల్ రెడీ నయనతార మరో రెండు ప్రాజెక్టులు కమిట్ అయింది. వాటిని పక్కన పెట్టడానికి లేదు. పైగా రజినీ సినిమా కోసం ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే, నయనతార.. రజినీకాంత్ సినిమాని మిస్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి…

బాలయ్య కోసం శ్రీలీల లుక్ టెస్ట్

సమంత షూటింగ్ కొచ్చేదెప్పుడు?

అందంతో మతిపోగోడుతున్న స్నేహ

- Advertisement -