ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నేపథ్యంలో కేబినెట్ మీటింగ్‌లో ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన తరుణంలో దానిపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. చేనేత బంధుపై సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సైతం త్వరలో ఈ స్కీం అమలు అవుతుందని స్పష్థం చేశారు. మరోవైపు 50 వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.