తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు నమోదు..

37
corona

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,13,012 కరోనా పరీక్షలు నిర్వహించగా, 621 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 67, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కేసులు గుర్తించారు. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది.

అదే సమయంలో 691 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,44,951 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,32,080 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,069 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,802కి చేరింది. అటు, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98 శాతంగా నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన నివేదకలో వెల్లడించింది.