ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ప్రాజెక్టుల రీడిజైనింగ్, సుధీర్, చెల్లప్ప కమిషన్ల నివేదికలతో పాటు పలు అంశాలపై చర్చించారు.
() పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు మంత్రివర్గం ఆమోదం
() కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆంధ్రా బ్యాంకు నుంచి రూ. 7,860 కోట్ల రుణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
()దేవాదుల ద్వారా మల్కాపూర్ జలశాయ నిర్మాణానికి అమోదం
() దేవాదుల ప్రాజెక్టు సామర్ద్యం 60 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం
() గంధమల్ల బస్వాపూర్, రిజర్వాయర్‌ల సామర్ద్యం పెంపు
()మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణాం, సామర్ద్యం పెంపునకు అమోదం
() రూ. 1100 కోట్లతో దేవాదుల ఫేజ్ – 3 పనులకు గ్రీన్ సిగ్నల్
()వరంగల్ నగరానికి మంచినీటి కోసం రిజర్వాయర్ నిర్మాణం
()2487 భాషా పండితులను 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేస్తు నిర్ణయం