9 మందితో కేబినెట్ విస్తరణ..

229
ts cabinet
- Advertisement -

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఈ నెల 19న 9 మందితో కేబినెట్‌ను విస్తరించనున్నారు సీఎం కేసీఆర్. విధేయతతో పాటు గతంలో మాట ఇచ్చిన ప్రకారం సీనియర్‌లకు అవకాశం కల్పించారు కేసీఆర్.

మంత్రులుగా ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌లకు కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్‌ను నియమించే అవకాశం ఉంది. ఎస్టీ కోటా నుంచి ఒకరికి, ఓ మహిళకు ఈసారి చాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సీఎం.. ఆయనను పూర్తిగా పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లేనని సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప జాబితాలో మార్పులుండవని తెలుస్తోంది.

కడియం శ్రీహరికి శాసనమండలి ఛైర్మన్‌ లేదా ఇతర బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం కసరత్తు చేశారు. కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే శాఖల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. మొత్తం 34శాఖలను 18గా మార్చారు. వాటినే మంత్రులకు కేటాయించనున్నారని తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్‌వద్దే నీటిపారుదల,పంచాయతీరాజ్‌, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖలు ఉండనున్నాయి.

- Advertisement -