- ఉత్తరాది నుంచి తెలంగాణకు కార్మికుల వలసలు
- తెలంగాణలో చేతినిండా పని
- ఉపాధి అవకాశాలు తెలంగాణలో పుష్కలం
- 40.2% నుంచి 43.5%కి పెరిగిన అవకాశాలు
- పరిశ్రమలు, రియల్ ఎస్టేట్లో ఉపాధి ఫుల్
- ఐ.టి, ఫార్మా రంగాల్లో భారీగా ఉద్యోగాలు
- కరోనా నుంచి వేగంగా కోలుకున్న తెలంగాణ
- స్పష్టంచేసిన ఆర్ బిఐ నివేదిక
- తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఒడిషా
ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసవెళ్ళే పరిస్థితులు తారుమారయ్యాయి. ఒకప్పుడు ఉపాధి కోసం, కూలీ పనుల కోసం జిల్లాలకు జిల్లాలే వలసలు వెళ్ళే ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని, అంతేగాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వలసల జిల్లాగా పేరుండేదని, ఇంకా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ముంబాయి, నాందేడ్, కోల్హాపూర్, నాగ్ పూర్, పూనా వంటి నగరాలకు వలసవెళ్ళే పరిస్థితులన్టీ తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలంగాణకు భారీగా వలస వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు పెరగడం, ఐ.టి, ఫార్మా రంగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందడంతో దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు రికార్డుస్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వలస వస్తున్నారని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో వలసలు పెరిగాయి గత మే నెలలో తెలంగాణలో ఉపాధి అవకాశాలు 40.2 శాతం ఉండగా అక్టోబర్ నెలాఖరు నాటికి అది కాస్తా 43.5 శాతానికి పెరిగిందని ఆర్ధిక శాఖకు చెందిన కొందరు అధికారులు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా సహకరించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ తెలంగాణలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భారీగా కార్మికులు వలసలు వస్తున్నారని వివరించారు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నాగానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నివేదికస్పష్టంచేసింది.
ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్ధిక కార్యకలాపాలు) ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో అక్కడే ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయనే ఆర్ధిక సూత్రాన్ని నిజంచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆర్.బి.ఐ. నివేదిక రుజువు చేసిందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆనందంతో వ్యాఖ్యానించారు.
గత మార్చి నెలలో 39.5 శాతం కార్మికులు, కూలీలకు తెలంగాణలో ఉపాధి లభించిందని, అదికాస్తా ఏప్రిల్ నెలకు వచ్చే సరికి 40.2 శాతానికి పెరిగిందని ఆర్.బి.ఐ. నివేదిక తెలిపింది. అదికాస్తా అక్టోబర్ నెలాఖరుకు 43.5 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆ మేరకు కార్మికుల వలసలు కూడా తెలంగాణకు పెరిగాయని తెలిపిందని ఆ అధికారులు వివరించారు.
తెలంగాణలో పారిశ్రామిక, ఐ.టి.పాలసీలు పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మారిపోవడం, రియల్ ఎస్టేట్ బూమ్ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉండటంతోనే కార్మికులు ఇక్కడకు వలసలు వస్తున్నారని తెలిపారు.
పరిశ్రమలు, ఐ.టి.లతో పాటుగా ఫార్మారంగం కూడా భారీగా ఊపందుకోవడంతోనే ఉద్యోగులు, వారికి అనుబంధంగా కార్మికులకు కూడా ఉపాధి లభిస్తోందని, ఈ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు అవసరమైన హోటల్, నిర్మాణరంగం, చిరు వ్యాపారాలు, రవాణా తదితర అన్ని రంగాల్లోనూ మ్యాన్ పవర్ అవసరాలు ఎక్కువగా ఉండటంతోనే బీహార్, ఒడిషా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలే కాకుండా పొరుగు దేశమైన నేపాల్ నుంచి కూడా వలస వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేసుకొంటున్నారని ఆ అధికారులు వివరించారు.
అంతేగాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా తాగునీరు, సాగునీటిని సరఫరా చేయడమే కాకుండా వ్యవసాయానికి ఉచితంగా 24/7 నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటం, పరిశ్రమలకు కూడా ఎలాంటి విద్యుత్తు కోతల్లేకుండా, లోవోల్టేజీ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తుండటంతోనే పారిశ్రామిక ఉత్తత్తులు భారీగా పెరిగాయని, అందుచేతనే సనత్ నగర్, ఎర్రగడ్డ, బాలానగర్, మేడ్చెల్, పటాన్ చెరూ, రామచంద్రాపురం వరకూ విస్తరించి ఉన్న కొన్ని పరిశ్రమలకు అవసరమైన కార్మికులందరూ ఉత్తర భారత రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని, అందుకే హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్లీ ఎల్లప్పుడు క్రిక్కిరిసి కనిపిస్తుంటాయని వివరించారు.
దీనికితోడు దేశంలోని మిగతా రాష్ట్రాలు కోవిడ్-19 కంటే ముందున్న పరిస్థితుల నుంత్పూర్తిగా కోలుకోలేకపోయాయని, తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే చాలా త్వరగా, వేగంగా కోలుకుందని ఆర్.బి.ఐ.నివేదిక స్పష్టంచేసినట్లుగా ఆ అధికారులు వివరించారు. కోవిడ్ పరిస్థితుల నుంచి త్వరగా కోలుకొని, కార్మికలోకానికి ఉపాధిని కల్పించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర రెండో స్థానంలో ఉందని, మూడో స్థానంలో ఒడిషా ఉందని ఆర్.బి.ఐ. తన నివేదిక స్పష్టంచేసింది. ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పన చెప్పకోదగ్గ స్థాయిలో పుంజకున్నట్లగా ఆర్.బి.ఐ.నెలవారీ నివేదిక పేర్కొంది. చాలా రాష్ట్రాల్లో ఉద్యోగ రేటు మహమ్మారి కాలం ముందుకు కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ మూడు రాష్ట్రాల్లోనే పెరిగినట్లు తెలిపింది.
ఆర్.బి.ఐ.అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సి.ఎం.ఐ.ఈ) గణాడాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ లో పోలిస్తే ఈ ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా ఉపాధి పొందిన కార్మికుల సంఖ్య 12.2 మిలియన్లు పెరిగినట్లుగా పేర్కొంది. అది అక్టోబర్ నెలనాటికి 14 మిలియన్లకు పెరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. కార్మికశక్తి భాగస్వామ్యం (లేబర్‌ఫోర్స్ పార్టిసిపేషన్) కూడా అక్టోబర్‌లో అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినట్లుగా నివేదిక స్పష్టంచేసింది.
ఇవి కూడా చదవండి..