ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలిః అసదుద్దీన్

332
AsaduddinOwaisi
- Advertisement -

కాంగ్రెస్ కు చెందని 12మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో వీలినం కావడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కొల్పొయిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 6కి పడిపోయింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోవడంతో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం ఉందని… ఈ నేపథ్యంలో, తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ ను కలుస్తామని… ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు.

- Advertisement -