రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.!

155
Telangana Assembly

కరోనా నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే వచ్చే సోమ,మంగళ వారాల్లో (అక్టోబర్ 12,13) అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం.

జిహెచ్ఎంసి చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. దీని కోసం అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. శుక్రవారం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.