‘గెట్ అవుట్’ ఈటెల.. బీజేపీ ప్లాన్ అదే!

47
- Advertisement -

బీజేపీలో ఈటెల రాజేందర్ ను పొమ్మనలేక పొగబెడుతున్నారా ? ఆయనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు తెర వెనుక కసరత్తులు జరుగుతున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీలో చేరిన తక్కువ సమయంలోనే కీలక నేతగా మారిన ఈటెల వల్ల కమలం పార్టీకి జరుగుతున్నా నష్టమేంటి ? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది ? అనే విషయాలను పరిశీలిస్తే. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్. ఆయన పార్టీలో చేరిన తరువాత చేరికల కమిటీ చైర్మెన్ బాద్యతను అప్పగించింది పార్టీ అధిష్టానం. అయితే ఆ పదవి పట్ల ఈటెల అసంతృప్తిగా ఉండడం, చేరికలు కూడా ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఈటెలపై అప్పటి నుంచే పార్టీలో కొంత అసంబద్దత నెలకొంది.

ఆ తరువాత ఈటెలను వలసదారుడిగా భావించిన కొంతమంది సీనియర్లు ఆయనపై వ్యతిరేక స్వరం వినిపిస్తూ వచ్చారు. ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్నవారికి ప్రదాన్యం ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన ఈటెలకు అధిక ప్రదాన్యం ఇవ్వడం ఏంటని కొండ విశ్వేశ్వర రెడ్డి, విజయశాంతి, వివేక్ వంటి నేతలు గగ్గోలు పెడుతూ వచ్చారు. ఆటుపోతే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి ఈటెల నే కారణం అనే వాదన కూడా ఉంది. వీరిద్దరి మద్య ఉన్న విభేదాలు అడపాదడపా బయట పడుతూనే ఉన్నాయి. ప్రచార కమిటీ చైర్మెన్ పదవిని ఈటెలకు కట్టబెట్టిన తరువాత బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, అప్పటినుంచి బీజేపీని విడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఈటెల విషయంలో బీజేపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడిందట.

అందుకే ఈటెలను పార్టీ నుంచి పంపిస్తే అన్నీ సమస్యలు సర్ధుకుంటాయనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సి‌ఎం అభ్యర్థి విషయంలో బీసీల నుంచి ఎన్నుకుంటాని ఇటీవల అమిత్ షా చెప్పడం కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఈటెల పోటీ చేయబోతున్న గజ్వేల్, హుజూరాబాద్ నియోజిక వర్గాల్లో ఆయన గెలుపు కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గజ్వేల్ లో కే‌సి‌ఆర్ బరిలో ఉండడం ఒక కారణమైతే.. హుజూరాబాద్ లో గతంతో పోల్చితే ప్రస్తుతం ఈటెల గ్రాఫ్ పూర్తిగా పడిపోయినట్లు అంతర్గత సర్వేలు చెబుతున్నాయట. అందుకే ఈటెలను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నికల ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:అసెంబ్లీ ఎన్నికలకు నోటీఫికేషన్..

- Advertisement -