రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రూప్ -2, గ్రూప్ – 4 సహా పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయగా తాజాగా మరో మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
కళాశాల విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్ల పోస్టులను దీనిద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 31 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
విద్యాశాఖలోనూ లైబ్రేరియన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ. మొత్తం 71 లైబ్రేరియన్ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఇందులో ఇంటర్ కమిషనరేట్ పరిధిలో 40 లైబ్రేరియన్ పోస్టులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 31 లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి జనవరి 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఇవి కూడా చదవండి..