నేడు విజయవాడకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

227
KCR-Flight

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విజయవాడకు వెళ్లనునున్నారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించనున్నారు. అనంతరం విభజన చట్టంలో పొందుపర్చిన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు, హైదరబాద్‌లోని భవనాల అప్పగింతపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది.

ఈ నెల 19లోగా సచివాలయ భవనాలు ఖాళీ చేస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి లేఖ రాశారు. విజయవాడలో సోమవారం జరిగే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాలస్వామి సన్యాస స్వీకరణ, పట్టాభిషేక మహోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.